ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన ఇండస్, ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ట్రేడింగ్ సెషన్‌లో నష్టాల్లో మొదలయ్యాయి. అయితే ఇండస్ బ్యాంక్ అకౌంటింగ్‌లో లోపాలు వెలుగులోకి రావడంతో ఇంట్రాడేలో షేర్లు 5 శాతానికిపైగా క్షీణించాయి. ఇక ఎయిర్ టెల్ షేర్లు కూడా శుక్రవారం నష్టాల్లోకి వెళ్లాయి. ఇంట్రాడేలో దాదాపు 3 శాతం షేర్లు క్షీణించాయి. వాటాను విక్రయించనున్నట్లు వస్తున్న వార్తలతో షేర్లపై ఒత్తిడి పెరిగింది.