ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్‌ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్యంపై కొన్ని వెబ్‌సైట్‌లు, సోషల్‌మీడియా వేదికలలో తప్పుడు కథనాలను తొలగించేలా ఆదేశించాలని కోరుతూ ఆమె రెండోసారి పిటిషన్ వేసింది. సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం గూగుల్‌కు నోటీసులు ఇచ్చింది. రెండేళ్లక్రితం ఆమెపై ప్రచురించిన తప్పుడు కథనాలకు ఆరాధ్య, ఆమె తండ్రి అభిషేక్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.