కేంద్రప్రభుత్వంపై పార్లమెంట్‌లో సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మహాకుంభమేళా ఘటనల్లో ఇంతవరకు మృతుల సంఖ్య, పూర్తి వివరాలివ్వలేదని ఆరోపించారు. కుంభమేళాకు కోట్ల మంది వస్తున్నారని గొప్పలను చెప్పుకుంటున్న కేంద్రం అందుకు సరైన చర్యలను తీసుకోలేదని ఘాటుగా విమర్శించారు. సమయాన్ని బట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వమే కుంభమేళాను నిర్వహిస్తుందన్నారు.