AP: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆల్బెండజోల్ మందులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 1-19 ఏళ్లలోపు వయసున్న వారికి ఈ మాత్రలు ఇవ్వనున్నారు. ఇవాళ మాత్రలు వేసుకోని వారికి ఈ నెల 17న అందించనున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.