ALERT: ఈ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు

61చూసినవారు
ALERT: ఈ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మంగళవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్