ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అండమాన్ సముద్రంలో నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఇది వాయుగుండంగా మరి ఈ నెల 24వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, 26వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.