ALERT: రేపు ఏపీలో భారీ వర్షాలు

69చూసినవారు
ALERT: రేపు ఏపీలో భారీ వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తాజాగా వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శనివారం సహా మరో మూడు రోజుల పాటు మన్యం, అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్