AP: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. సోమవారం పలు జిల్లాల్లో విస్తారంగా కురుస్తాయని APSDMA వెల్లడించింది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, తూ.గో, ప.గో, బాపట్ల, గుంటూరు, శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, రాయలసీమ సహా పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.