AP: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. గురువారం సహా మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని, బాపట్ల, కృష్ణా జిల్లాలలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. అటు శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సహా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు చెట్లు కింద, పొలాల్లో ఉండరాదన్నారు.