AP: ద్రోణి ప్రభావంతో రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ఈ మేరకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురవనున్నాయి.