AP: ఫెంగల్ తుఫాను సోమవారం ఉదయానికి వాయుగుండంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండ్రోజుల్లో ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.