AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి జిల్లా చింతూరు, కూనవరం, మారేడుమిల్లిలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మన్యం, విజయనగరం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోని 10 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.