ALERT: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

54చూసినవారు
ALERT: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్