AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బుధవారం అల్లూరి, ఉభయ గోదావరి, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కోనసీమ, పల్నాడు తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది.