AlERT: ఎండలు.. పిడుగులతో భారీ వర్షాలు

73చూసినవారు
AlERT: ఎండలు.. పిడుగులతో భారీ వర్షాలు
AP: రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంది. శుక్రవారం పలు జిల్లాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలతో పాటు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, మన్యం, కాకినాడ, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంది. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.