రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించిన ధృవీకరణ పత్రాలేవీ భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదని, తమ మొబైల్ ఫోన్లోనే అన్ని పత్రాలు డిజిటల్ రూపేణా పొందుపరచవచ్చని, ఆ దిశగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగేపని లేకుండా పౌరులకు వారికి కావాల్సిన అన్ని సేవలు వారి చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే అందించాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు.