పాకిస్తాన్ ప్రభుత్వం పనికిమాలిన ప్రచారాలు చేస్తూ అక్కడి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని BJP ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్యా విమర్శించారు. ఇటీవల భారత్-పాక్ ఉద్రిక్తతల్లో పాక్ వైమానిక దళం పైచేయి సాధించిందని.. ఆ వార్తను ప్రముఖ బ్రిటన్ వార్తాపత్రిక ది టెలిగ్రాఫ్ ప్రచురించిందని ఆ దేశ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ గొప్పలు చెప్పుకొన్నారు. అయితే, అది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది.