AP: ఏడాదిలోపే సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. జూన్ 15న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు.