AP: రాష్ట్రంలోని పలు పట్టణ స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన 12 పోస్టులకు సోమవారం ఎన్నికలు నిర్వహించగా.. 7 స్థానాల్ని కూటమి కైవసం చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఏలూరు నగరపాలక సంస్థలో 2 డిప్యూటీ మేయర్లు, నూజివీడు మున్సిపాలిటీ వైస్ చైర్మన్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 2 వైస్ చైర్‌పర్సన్ పదవుల్ని కూటమి సొంతం చేసుకుంది. మిగిలిన 5 స్థానాలకు ఇవాళ ఎన్నిక జరగనుంది.