రాష్ట్రానికి నిధులు కేటాయించండి: సీఎం చంద్రబాబు

57చూసినవారు
రాష్ట్రానికి నిధులు కేటాయించండి: సీఎం చంద్రబాబు
AP: ఢిల్లీ పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అర్వింద్ పనగరియాను సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై ఆయనతో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరారు. గత ఐదేళ్లలో రంగాల వారీగా జరిగిన నష్టంపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్థికంగా గట్టెక్కించే చర్యలకు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్