కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో ఏపీకి భారీగా నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయించారు. పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.