చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్న అల్లు అర్జున్‌

82చూసినవారు
సినీనటుడు అల్లు అర్జున్‌ HYD చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం పీఎస్‌ ముందు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆయన్ను ఆదేశించిన విషయం తెలిసిందే. బెయిల్‌ షరతుల దృష్ట్యా అల్లు అర్జున్‌ చిక్కడపల్లి పీఎస్‌కు వచ్చారు. అక్కడ ఆయన సంతకం చేయనున్నారు. కాగా కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావొద్దని బన్నీకి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్