విశాఖ: దేశం మొత్తం మోదీ నాయ‌క‌త్వం కోరుకుంటోంది

50చూసినవారు
విశాఖ: దేశం మొత్తం మోదీ నాయ‌క‌త్వం కోరుకుంటోంది
ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి చారిత్రాత్మక విజయంపై బిజెపి సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈమేర‌కు విశాఖ బీజేపీ కార్యాల‌యం నుంచి ఆయ‌న పేరిట ఓ ప్ర‌క‌ట‌న శ‌నివారం విడుద‌ల చేశారు. గత రెండు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 నుంచి 8 స్థానాలకు మాత్రమే పరిమితమైన బిజెపి ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి రావడం మోదీ విధానాలే కార‌ణ‌మ‌న్నారు.

సంబంధిత పోస్ట్