అనంతగిరి: ఘాట్ రోడ్డుపై కూలిన భారీ వృక్షం

65చూసినవారు
అనంతగిరి: ఘాట్ రోడ్డుపై కూలిన భారీ వృక్షం
అనంతగిరి మండలంలోని త్యాడ ఘాట్ రోడ్డులో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు భారీ చింతమాను కూలింది. దీంతో గంటపాటు విశాఖ అరకు రాకపోకలు కొనసాగించే పర్యటకులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీస్ సిబ్బంది శ్రావణ్ రాంబాబు స్పందించారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న చెట్టును జెసిబి సహాయంతో తొలగించే చర్యలు చేపట్టడంతో వాహనాలు రాకపోకలు కొనసాగించాయి.

సంబంధిత పోస్ట్