అరకులోయ మండలంలోని చినలబుడు పంచాయతీ పరిధి తురాయిగుడలో అలెఖ్ మహిమ ధర్మ భక్తుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే బాల్య లీల జాతర మహోత్సవానికి అరకు ఎమ్మెల్యే రేగం. మత్స్యలింగం పాల్గొన్నారు. విశ్వశాంతి బ్రహ్మయజ్ఞం మహోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని భగవంతునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ. గురువారం రాత్రి జరిగే జాతర మహోత్సవానికి చుట్టుపక్కల భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.