అరకులోయ మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీ పరిధి కొండవీధిలో ఉన్న డ్రైనేజీలో మురుగును తొలగించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా డ్రైనేజీలో మురుగు నీరు నిలువ ఉండడంతో భరించలేని దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు బుధవారం వాపోయారు. అధికారులు స్పందించే డ్రైనేజీలో నిలిచిన మురుగునీటిని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.