చాపగెడ్డ గ్రామానికి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలి

51చూసినవారు
చాపగెడ్డ గ్రామానికి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలి
గూడెంకొత్తవీధి మండలంలోని దేవరపల్లి పంచాయతీ పరిధి చాపగెడ్డ గ్రామానికి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులకు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న భారీ వర్షాలతో ఉన్న మట్టిరోడ్డు బురదమయంగా తయారై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రామగడ్డ నుండి చాపగెడ్డ వరకు ఒక కిలోమీటర్ సిసి రోడ్డు నిర్మాణం చేపట్టి తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు శుక్రవారం కోరారు.

సంబంధిత పోస్ట్