మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పెదబయలు మండలంలోని ఇంజరి పంచాయతీ పరిధి ఎర్రబయలు గ్రామంలో పంట పొలాలు ఆదివారం నీట మునిగాయి. వేల రూపాయల్లో పెట్టుబడి చేసి ఏడాది వేసిన వరి నాట్లు ఎకరాల్లో మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వమే గుర్తించి పరిహారం ఇప్పించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.