చొంపి గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్

79చూసినవారు
అరకులోయ మండలంలోని చొంపిలో గురువారం సాయంత్రం బ్లీచింగ్ చల్లి దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. గ్రామంలో దోమలు విపరీతంగా పెరిగాయని దీనివల్ల ప్రజలు డెంగ్యూ మలేరియా విషజ్వరాలు వంటి అనారోగ్యానికి గురికాకుండా ఉండడానికి ముందస్తుచర్యలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్తచెదారం వేయరాదని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్