మెట్టవలసలో మంచినీటి సమస్య పరిష్కరించాలి

78చూసినవారు
అనంతగిరి మండలంలోని వేంగాడ పంచాయతీ పరిధి మెట్టవలసలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు అధికారులు ఏర్పాటు చేసిన మంచినీళ్ళ ట్యాంక్ వద్ద వస్తున్న బురద నీటినే తమ అవసరాలకు వినియోగించుకొని పలు రోగాల బారిన పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు స్పందించి మెట్టవలసలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు ముత్యాలమ్మ శాంతి హసిత మంగళవారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్