పొర్లుబంధలో మంచినీటి సమస్య పరిష్కరించాలి

85చూసినవారు
అనంతగిరి మండలంలోని వాలసి పంచాయతీ పరిధి పొర్లుబంధ గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 30 కుటుంబాలు జీవిస్తున్న గ్రామంలో కొండ వాగుల ద్వారా కొళాయిలో వచ్చే కలుషిత నీటితోనే తమ అవసరాలకు వినియోగించుకుని పలు రోగాల బారిన పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు ప్రభుత్వం స్పందించి పొర్లుబంధలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు బుధవారం కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్