పెదబయలు మండలంలోని అడుగులుపుట్టు పంచాయతీ పరిధి సంపంగిపుట్టు జంక్షన్ వద్ద శనివారం 431 కేజీల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ రమణ తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో గంజాయి పట్టుబడిందని తెలిపారు. గంజాయి విలువ సుమారు 22 లక్షలు ఉంటుందన్నారు. వాహనంతోపాటు గంజాయి తరలిస్తున్న శిబింద్ర హంతల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.