పాడేరు మండలంలోని జరిగిన రంజన్ వేడుకల్లో గురువారం పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస. విశ్వేశ్వరరాజు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ నమాజు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహనాన్ని దయ గుణాన్ని సోదర భావాన్ని శాంతి సమరస్యాలను పెంపొందించి మనలో కొత్త ఉత్సహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ పవిత్రమైన పర్వదినం రంజాన్ పండుగని అన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగని ఆనందంగా జరుపుకోవాలని కోరారు.