ముంచంగిపుట్టు మండలంలోని గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. మండలంలోని వనుగుపుట్టు నుంచి నీలగిరి కర్రల లోడు వేసుకుని ముంచంగిపుట్టు వైపు వస్తున్న లారీ సుజనపేట గ్రామ సమీపంలోని ముత్యాలమ్మ జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.