అనంతగిరి మండలంలోని లుంగాపర్తి పంచాయతీ పరిధి ఒనుకొండ గిరిజనులకు వంతెన కష్టాలు తప్పడం లేదు. ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలకు వాగి పొంగి ప్రవహిస్తుండడంతో వంతెన లేక గిరిజనులు ప్రాణం అరచేతిలో పెట్టుకొని రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీవర్షంతో వాగు పొంగడంతో గిరిజనులు అతి కష్టం మీద ఒనుకొండకి చేరుకున్నామని ఈ సమస్యపై అధికారులు స్పందించాలన్నారు.