పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని వినతి

83చూసినవారు
పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని వినతి
పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్టు పంచాయతీ పరిధి సంతవిధికి చెందిన కిల్లో. మోహన్ అనే దివ్యాంగుడు బుధవారం కోరారు. ఆయన మాట్లాడుతూ. పుట్టుకతోనే తన వీపు మీద కాయ వచ్చి క్రమంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పింఛన్ మంజూరు చేయాలని అధికారులు చుట్టూ తిరిగిన నేటి వరకు పింఛన్ మంజూరు కావడం లేదని వాపోతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వేడుకుంటున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్