విద్యార్థులు సామాజిక మధ్యమాలకు దూరంగా ఉండాలి

63చూసినవారు
విద్యార్థులు సామాజిక మధ్యమాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులు సామాజిక మధ్యమాలకు దూరంగా ఉండాలని గిరిజన సంఘం నేతలు కిషోర్ బాబుజీ అన్నారు. శనివారం పాడేరులోని శ్రీమాదమాంబ స్కూల్ అఫ్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినిలతో సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ మొబైల్ తలదించుకునేలా చేస్తే పుస్తకం తల ఎత్తుకునేలా చేస్తుందన్నారు. మొబైల్ ఫోన్లకు ఎంత దూరంగా ఉంటే జీవితంలో అంత పైకి ఎదుగుతారన్నారు. రోజు పుస్తక పఠనం చేసి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.