కోతకు గురైన రహదారికి మరమ్మతులు చేపట్టాలి

70చూసినవారు
కోతకు గురైన రహదారికి మరమ్మతులు చేపట్టాలి
పెదబయలు మండలంలోని గుల్లెలు పంచాయతీ పరిధి రాయిమామిడి జంక్షన్ నుంచి ఇంజరి గ్రామం వరకు కోతకు గురైన రహదారికి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రెండు రోజులుగా కురిసిన భారీవర్షాలతో రహదారి అంచులు కోతకు గురైందని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదని ఆందోళన చెందుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఈ సమస్యపై సంబంధిత ఆర్అండ్బి అధికారులు స్పందించాలని పలువురు గిరిజనులు శనివారం కోరారు.

సంబంధిత పోస్ట్