సొంతంగా రోడ్డుకు మరమ్మతులు చేసుకుంటున్నా గిరిజనులు

71చూసినవారు
సొంతంగా రోడ్డుకు మరమ్మతులు చేసుకుంటున్నా గిరిజనులు
అనంతగిరి మండలంలోని కివర్ల పంచాయతీ పరిధి సీడీవలసకి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల గుత్తేదారు రోడ్డు నిర్మాణం చేపట్టి రోడ్డుపై కంకరరాళ్ళు పోసి అర్ధాంతరంగా విడిచిపెట్టేయడంతో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డు కొట్టుకుపోయి కోతకు గురైంది. దీంతో గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటూ బుధవారం కొట్టుపోయిన రహదారికి సొంతంగా మరమ్మతులు చేపట్టారు. అధికారులు స్పందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్