ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్టు పంచాయతీ పరిధి పిట్టగుడ్లు సరియపల్లి నేరేడుపుట్టు గ్రామాల రేషన్ కార్డు దారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని శుక్రవారం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యమున్న బియ్యం బండి వచ్చి బియ్యం పంపిణీ చేయడం లేదని దీనితో 3 కిలోమీటర్లు కాలినడకన వచ్చి బియ్యం తీసుకుంటున్నామని వాపోతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.