భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆనందపురం మండలం రామవరం పంచాయతీకి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు, భీమిలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకరపూడి వరహాలరాజు, ఆయన కుమారుడు, వైసీపీ పాడేరు ఎన్నికల ఇంచార్జ్ శ్రీకాంత్ రాజు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. బుధవారం శొంట్యాంలో జరిగిన సభలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.