ఈ నెల 5వ తేదిన తలపెట్టిన వైసీపీ ఫీజు పోరు కార్యక్రమం వాయిదా పడిందని భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిందన్నారు. కార్యక్రమం నిర్వహించే తదుపరి తేదీలను మళ్లీ తెలియజేస్తామన్నారు. వైసీపీ శ్రేణులు ఈ విషయం గమనించాలన్నారు.