ఆనందపురం మండలం కుసులవాడలో శనివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలన్నీ త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.