చేనేత, హస్త కళలు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ శిల్పారామంలో 15 రోజుల పాటు జరగనున్న అఖిల భారత చేనేత వస్త్ర ప్రదర్శనను గురువారం ప్రారంభించారు. ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు 87 స్టాల్స్ ఏర్పాటు చేశారు.