సముద్ర తాబేళ్లు పెట్టిన గుడ్ల రక్షణకు నిధుల కొరత ఏర్పడింది. దీంతో ఈ ఏడాది విశాఖ తీరంలో తగినన్ని హేచరీస్‌లు ఏర్పాటుచేయలేని పరిస్థితి వచ్చింది. గత ఏడాది నాలుగు చోట్ల హేచరీల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే. అందులో రూ. మూడు లక్షల బిల్లులు ఇంతవరకూ మంజూరుచేయలేదు. దీంతో ఈ ఏడాది నాలుగుచోట్ల కాకుండా ఒక్క సాగర్‌నగర్‌లో మాత్రమే హేచరీ నిర్మించారు.