విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు సంబంధించి దివ్యాంగులకు క్రికెట్ ఎంపిక పోటీలు ఈ నెల 8వ తేదీ నుంచి విశాఖలోని ఏసీఏ వీడిసిఏ బి గ్రౌండ్ లో ఆ రోజు ఉదయం 9 గంటలనుంచి నిర్వహించనున్నట్టు నిర్వాహకులు యడ్లపల్లి సూర్యనారాయణ, సభ్యులు రామన్ సుబ్బారావు సురవరపు, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ ఎంపిక క్రికెట్ క్రీడలో నైపుణ్యం ఉన్న 4 కేటగిరిలకు సంబంధించి ఎంపికలు నిర్వహిస్తామన్నారు.