విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజు ఉత్సవాలలో భాగంగా బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు పీఠ ప్రాంగణంలోని 16 అడుగుల ఏకశిలా దాసాంజనేయ మూల విరాట్ కు పాలు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం, పీఠంలోని అన్ని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.