ఈ నెల 17, 18 తేదీల్లో విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో జరగనున్న వేవ్స్-2025 గైనకాలజీ జాతీయ సదస్సు నేపథ్యంలో 'నో యువర్ నంబర్స్' (కెవైఎన్) ప్రాముఖ్యతను సదస్సు నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రాధ శుక్రవారం తెలిపారు.
ఫాగ్సీ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా మహిళల బరువు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి, హిమోగ్లోబిన్ స్థాయి వంటి ముఖ్యమైన ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.