విశాఖలో బీజేపీ సంబరాలు

50చూసినవారు
విశాఖలో బీజేపీ సంబరాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొండంత బలాన్నిచ్చాయని విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామ రాజు పేర్కొన్నారు. శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా నగరంలోని లాసన్స్ బే కాలని బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఢిల్లిలో బీజేపీ కూటమివిజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు ఆనందంలో ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్