విశాఖ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 66 కిలో మీటర్ల మేర విజయవాడ మెట్రో, 76. 90 కిలోమీటర్ల మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డిపిఆర్ లు ఆమోదించారు. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. మెట్రో ఎండి రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా మెట్రో ప్రాజెక్టు స్థితిగతులను వివరించారు.